గుంటూరు: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఆయన్ని పలకరించి, అందుబాటులో ఉండేందుకు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొన్నారు. 2,3 రోజులుగా సతీమణి భారతి అక్కడే ఉన్నారు. తల్లి విజయమ్మ ముందు వచ్చి పలకిరించి, తిరిగి సోమవారం అక్కడకు చేరుకొన్నారు. సాయంత్రం అంతా ఇద్దరూ జగన్ పక్కనే ఉండి సపర్యలు చేశారు. రాజులా వెలిగిన రాజన్న కుటుంబ సభ్యుల్ని చూసి అభిమానులు, కార్యకర్తలు ఉద్వేగానికి లోనయ్యారు.<br/>అటు బెంగళూరు నుంచి జగన్ సోదరి షర్మిల బయలు దేరారు. రాత్రి బాగా పొద్దు పోయాక దీక్ష స్థలికి చేరుకొన్నారు. అప్పటికే బాగా అలసిపోయిన వైఎస్ జగన్ బడలికతో విశ్రాంతి కి ఉపక్రమించారు. షర్మిల రాక ను తెలుసుకొని అక్కడే ఆయన పలకరించారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకొన్నారు. జగన్ పూర్తిగా నీరసించటంతో అక్కడే ఆమె మౌనంగా కాసేపు గడిపారు.