శుభాకాంక్షలు


బీహార్ ఎన్నికల్లో నితీశ్
కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ద్వయం ఘన విజయం సాధించింది. మహా కూటమి మహా విజయాన్ని
సొంతం చేసుకొంది. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో మహా కూటమి కి 178 స్థానాలు లభించాయి.
బీజేపీ పక్షం మాత్రం 58 స్థానాలతో సరిపెట్టుకొంది. ఇతరులు ఏడు స్థానాల్ని దక్కించుకొన్నారు.
లెక్కింపు మొదలైన నాటి నుంచి మహా కూటమి విజయం స్పష్టంగా తేలుతూ వచ్చింది. చివరకు
నితీశ్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమికి అఖండ విజయం దక్కింది.

బీహార్ ఎన్నికల్లో ఘన
విజయాన్ని సొంతం చేసుకొన్న నితీశ్ కుమార్ , లాలూ ప్రసాద్ జంటను ప్రతిపక్ష నాయకుడు,
వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా వెబ్
సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. 

Back to Top