అమరావతి: రాజకీయ నాటకంలో భాగంగా కుట్రపూరిత కూటములను కడుతూ, కొత్త మిత్రులను వెతుకుతూ రాష్ట్రంలోని పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికి వదిలేశారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ట్విట్టర్‌లో మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు..మా ఉద్యమాలు తెలియకపోవచ్చు..కానీ మేము చేసిన నిరంతర పోరాటాలు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమని అన్నారు. ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.