నాలుగున్నరేళ్లుగా వైయస్‌ జగన్‌ది ఒకే మాట.ఒకే బాట..


ప్రత్యేహోదాపై చిత్తశుద్ధితో పోరాడుతున్న ఘనత వైయస్‌ఆర్‌సీపీదే..
వైయస్‌ఆర్‌సీపీ నేత మార్గాని భరత్‌..

ఢిల్లీఃఏపి ప్రజలకు ప్రత్యేకహోదా ఇస్తామని టీడీపీ,బీజేపీలు మోసం చేశాయని వైయస్‌ఆర్‌సీపీ నేత మార్గాని భరత్‌ అన్నారు.ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.నరేంద్రమోదీ, చంద్రబాబు ప్రజలకు మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారన్నారు. హోదా వద్దు అని ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారన్నారు. ప్రత్యేకహోదాపై పోరాటాలు జరిపితే కేసులు పెట్టి జైల్లో పెట్టించారని గుర్తు చేశారు.ప్రజల కోసం నిరంతరం ప్రత్యేకహోదాపై పోరాడిన ఘనత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కుతుంది.యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు మళ్లీ ధర్మపోరాట దీక్షలంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.కల్లబొల్లి మాటలను చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.. నాలుగున్నర సంవత్సరాలుగా వైయస్‌ జగన్‌ది ఒకేమాట.ఒకే బాట అని, ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top