పులిచింతల ప్రాజెక్టు కట్టిన ఘనత వైయస్‌ఆర్‌దే


– గుంటూరు జిల్లాను నాన్నగారు గెండెల్లో పెట్టుకున్నారు
– ఇసుక దందాలో చినబాబుకు, టీడీపీ నేతలకు వాటాలు
– ఇసుక దందా వల్ల 25 మంది ప్రాణాలు కోల్పోయారు
–నిరుద్యోగ భృతి కింద ప్రతి ఇంటికి రూ.96 వేలు బాకీ
– బ్యాంకుల వడ్డీ డబ్బులు కట్టడం చంద్రబాబు మానేశారు
– బాబు నాలుగేళ్ల పాలనలో చక్కగా జరిగింది అవినీతి ఒక్కటే
– చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే
– రాష్ట్రంలో చట్టాలు పని చేయడం లేదు
– అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు
– గజదొంగ అసెంబ్లీని నడిపితే ఎలా ఉంటుందో అలా ఉంది
– ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు
– చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి
– రైతులకు 9 గంటలు ఉచితంగా పగటి పూట కరెంటు
– రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
– రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు
– పెండింగ్‌ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తాం
– పాడి రైతులకు అండగా ఉంటా 
 గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు నిర్మించిన ఘతన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిదే అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. మహానేత మరణాంతరం రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడని ఆయన విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతామని, ఏ ఒక్కరి ముఖంలో కూడా కన్నీరు రాకుండా తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం పెదకూరపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

ఈ రోజు ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎండలు తీక్షణంగా ఉన్నా కూడా వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఒకవైపున వారికి ఉన్న బాధలు చెబుతూ..అర్జీలు ఇస్తూ..మరోవైపు నా భుజాన్ని తడుతూ..అన్నా..నీకు తోడుగా మేమంతా ఉన్నామంటూ నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఈ ఎండలో, ఈ నడిరోడ్డుపైకి వచ్చి నాతో నడవాల్సిన అవసరం లేదు. నడుచుకుంటూ వచ్చి ఈ నడిరోడ్డుపై, దుమ్ములో నిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా కూడా మండుతున్న ఎండలను ఖాతర్‌ చేయకుండా చిక్కని చిరునవ్వులతోనే ప్రేమానురాగాలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరున హృదపూర్వక కృతజ్ఞతలు..
– ఈ నియోజకవర్గంలో అడుగుపెడుతూనే..రైతులు నావద్దకు వచ్చారు. నిజంగా ఒక వ్యక్తి మంచి చేస్తే ఆ వ్యక్తిని చనిపోయిన తరువాత కూడా మరిచిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారన్నది ఆ రైతుల మాటల్లో కనిపించింది. Výంంటూరు జిల్లా అంటే నాన్నగారికి చెప్పలేనంత ప్రేమ ఉండేది. ఈ జిల్లాను గుండెల్లో పెట్టుకున్నారు. మహానేత మనమధ్య లేకపోయినా అన్నా..మేమంతా నీకు తోడుగా ఉంటామని అండగా నిలబడ్డారు.
– పులిచింతల ప్రాజెక్టు నాన్నగారు రాకముందు ఈ ప్రాజెక్టు కట్టాలన్నా ఆలోచన ఏ ఒక్క నాయకుడికి ఆలోచన రాలేదని రైతులు అన్నారు. ఇవాళ కృష్ణజలాలపై ఆధారపడ్డామన్నా..నీరు అందని పరిస్థితిలో ఉంటే మా గురించి ఏ ఒ క్కరు పట్టించుకోలేదన్నా అని...ఒక్క మహానేత ఒక్కరే మా గురించి ఆలోచించారని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ఆలోచన చేయలేదు. మిగిలిపోయిన 5 శాతం పనులు కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తి చేసి గేట్లు ఎత్తారు. మళ్లీ అదే ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించి ప్రజలకు జ్ఞాపకశక్తి ఉండదనుకున్నారు. తెలంగాణలోని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద çరూ.125 కోట్లు ఇచ్చేందుకు నాలుగేళ్లు నాన్చి నాన్చి పెట్టారు. పబ్లిషిటి కోసం ఏమైనా చేస్తారు..రాష్ట్రాన్ని అమ్మేందుకు కూడా చంద్రబాబు సిద్ధమే. 
– ఇదే పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన రైతులు నా వద్దకు వచ్చి అన్నా..నీరు ఇవ్వాలని నాన్నగారిని అడిగిన వెంటనే 14 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేశారని ఆ రైతన్నలు అంటున్నారు. దాదాపు 38 వేల ఎకరాలకు నీరు అందించారు. దివంగత నేత చనిపోయిన తరువాత ఇదే నియోజకవర్గం వైపు  ఒకసారి చూడండి. ఇదే నియోజకవర్గంలో 13 వేల ఎకరాలకు నీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లుగా పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యే ఒక్క ఎత్తిపోతల పథకాన్ని కూడా మంజూరు చేయించలేని దద్దమ్మలు. వీరికి పాలించే అర్హత ఉందా? 
– ఈ నియోజకవర్గంలో ప్రజలు చెబుతున్న కథలు చెబుతున్న ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏది వదలిపెట్టకుండా లంచాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఓ సినిమా రిలీజ్‌ అయ్యింది. ఎమ్మెల్యే అనే సినిమా విడుదల అయ్యింది. దీనికి మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అన్న ట్యాగ్‌ లైన్‌ ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఉన్న ట్యాగ్‌లైన్‌ ఏంటో తెలుసా? మామూళ్లు, లంచాలు తీసుకునే అబ్బాయి అని ట్యాగ్‌లైన్‌ ఉంది. కృష్ణానదిలో వేలకొద్ది లారీల్లో ఇసుక తరలిస్తున్నారన్నా..గుంటూరు నడిబొడ్డున వేల వేల లారీలు విచ్చలవిడిగా తోలుతున్నారు. అడిగే నాథుడు లేడు. అడ్డగోలుగా ఫొటోలతో సహా కళ్ల ముందు కనిపిస్తున్నా..ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. కారణం ఈ లంచాలు, అవినీతిలో ఎమ్మెలకు ఇంతా..చిన్న బాబుకు ఇంత వాటా. రేపు పొద్దున ఈ వ్యవస్థలు పనిచేస్తాయా? ముఖ్యమంత్రి వస్తున్నారంటే మాములుగా వణికిపోతారు. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, చిన్నబాబుకు, ఎమ్మెల్యేలకు వాటాలు పంచుకుంటున్నారు.
– ఇదే నియోజకవర్గంలో కృష్ణా నదిలో ఇసుక తవ్వడంతో లిప్టులకు నీళ్లు కూడా అందడం లేదు. ఇదే నియోజకవర్గంలో 22 మంది ప్రాణాలు కల్పోయారు.  ఇంతటి దారుణంగా అవినీతి జరుగుతోంది. 
– ఈ ప్రభుత్వం ఏది వదిలిపెట్టడం లేదు. చివరకు దేవుడి బూములు కూడా వదలిపెట్టడం లేదు. సదావర్తి భూములు 84 ఎకరాలు, ఎకరా రూ.7 కోట్లు రిజిస్ట్రేషన్‌ విలువ ఉంటే..దాన్ని దోచుకునేందుకు ఎమ్మెల్యే కుట్రలు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది.
– నీరు–చెట్టు పేరుతో దళితులు, పేదల భూములపై టీడీపీ నేతలు గద్దలా వాలిపోయి మట్టి అమ్ముకుంటున్నారు. ఇంతటి దారుణమైన పాలన ఈ నియోజకవర్గంలోనే చూశాం. ఇంతకంటే దారుణమైన పాలన రాష్ట్రంలో కూడా జరుగుతోంది.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీరంతా చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీలన చేసుకోండి. అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసే వారు నాయకులుగా కావాలా? ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. రైతులకు రుణమాఫీ అన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుVó ళ్లలో బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు ..ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను మోసం చేయాలంటే ఎవరైనా ఆలోచన చేస్తారు. ఆడవాళ్లు కన్నీరు పెడితే అరిష్టం అంటారు. చంద్రబాబు పాలనలో ఎడ్వని ఆడపడుచులు లేరు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా?
చంద్రబాబు చేసిన అన్యాయం ఏంటో తెలుసా..గత ప్రభుత్వాలు పొదుపు సంఘాలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు డబ్బులు కట్టేవారు. చంద్రబాబు సీఎం అయ్యాక బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టడం మానేశారు. బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. ఈయన గారి పుణ్యమా అని ఎవరికి రుణాలు అందడం లేదు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇ వ్వకపోతే ఇంటికి మనిషిని పంపించి అమ్మా..చంద్రబాబు స్వయంగా సంతకం చేసి లెటర్‌ పంపించారు. మీరు చదవకపోయినా ఫర్వాలేదు..ఇంటికో ఉద్యోగం ఇస్తారు. లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి రూ.96 వేలు చంద్రబాబు బాకీ పడ్డాడు. ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే రూ.96 వేల సంగతి ఏంటి అని ప్రశ్నించండి
– చంద్రబాబు నాడు పిల్లలు తాగి చెడిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపులు లేకుండా చేస్తానని చెప్పారు. ఇవాళ ఏదైనా గ్రామంలో తాగడానికి మినరల్‌ ప్లాంట్‌ ఉందో లేదో తెలియదు కానీ, మందు షాపు లేని గ్రామం లేదు. ఈయనగారి పాలనలో ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం తెచ్చి ఇస్తున్నారు.
– కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని, అధికారంలోకి వచ్చాక కరెంటు చార్జీలు తగ్గిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు అన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాకముందు మనకు కరెంటు బిల్లులు రూ.50, 70, రూ.100 లోపు వచ్చేది. గతంలో రెండు నెలలకు  ఒకసారి బిల్లులు కట్టేవాళ్లం. ఇప్పుడు నెల నెల బిల్లు కట్టాల్సి వస్తోంది. ఇవాళ ఇంటింటికి కరెంటు బిల్లు రూ.500, 600, 1000 చొప్పున వస్తున్నాయి. నేరుగా రెంటోళ్లు ఇంటికి వచ్చి అది ఉంది, ఇది లేదు అంటు ఫెనాల్టీలు లాగుతున్నారు.
– చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు బియ్యం కోసం మనందరం కూడా రేషన్‌షాపులకు వెళ్లేవాళ్లం. నాలుగేళ్ల క్రితం రేషన్‌షాపుల్లో బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోదుమ పిండి, గోదుమలు, కారంపొడి, పసుపు ఇచ్చేవారు. ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. అందులో కూడా వేలిముద్రలు పడటం లేదని కోతలు కోస్తున్నారు. 
– దేశంలో ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్, డీజిల్‌ రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లీటర్‌పై రూ.7 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో బాదుడే బాదుడు. ఆర్టీసీ చార్జీలు కూడా బాదుడే బాదుడు. పండుగ రోజు బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. 
– చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో మనం చూసింది ఏంటో తెలుసా? చక్కగా జరిగింది ఒకటి ఉంది అది ఏంటో తెలుసా? అవినీతి మాత్రం చక్కగా జరిగింది. మట్టి, ఇసుక, మద్యం, కాంట్రాక్టర్లు,బొగ్గు, కరెంటు కొనుగోలు, రాజధాని బూములు, చివరికి గుడి భూములను కూడా వదిలిపెట్టడం లేదు. పైన చంద్రబాబు మేస్తారు. కింద జన్మభూమి కమిటీలకు అప్పగించారు. గ్రామాల్లో పింఛన్లు కావాలన్నా లంచాలు. మరుగుదొడ్డి కావాలన్నా లంచాలే. మనకు ఏదైనా కావాలంటే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వాళ్లు అంటున్నారు. చంద్రబాబు పాలనలో చట్టాలు ఉండవ్‌. అన్యాయం అన్నది ఏ స్థాయిలో ఉందో తెలుసా? దోచేచిన సొమ్ముతో ఒక్కొ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తారు. వారితో రాజీనామాలు చేయించరు. దగ్గరుండి స్పీకరే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో నలుగురు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇవాళ అసెంబ్లీ చూస్తే చట్టాలకు ఎలా తూట్లు పొడవాలి అన్నట్లుగా ఉంది. ఒక గజ దొంగ అసెంబ్లీని నడిపితే ఎలా ఉంటుందో అలా ఉంది అసెంబ్లీ తీరు.
– చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలు, రాజ్యాంగానికి తూట్లు పొడిచిన దృశ్యాలు చూశాం. రేపుపొద్దున పొరపాటున చంద్రబాబును క్షమిస్తే..వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. దానికి బోనస్‌గా బెంజి కారు కొనిస్తా అంటారు. నమ్మరు కాబట్టి..ప్రతి ఇంటికి తన మనిషిని పంపించి రూ.3 వేలు చేతిలో పెడతారు. డబ్బులు ఇస్తే వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి లాక్కున్నదే. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు బంగాళఖాతంలో కలిపేయండి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది.
– రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ఇందులోని అన్ని విషయాలను ఒకే మీటింగ్‌లో చెబితే సమయం సరిపోదు. ఈ మీటింగ్‌లో నవరత్నాలలోని రైతులకు ఏమి చేస్తామన్నది చెబుతున్నాను.
– ఇవాళ రైతులు ఎలా బతుకుతున్నాడు. మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. రైతులు అవస్థలు పడుతున్నారు. రేపు మనం ఏం చేస్తామంటే..రైతులకు ప్రధాన సమస్యల్లో మొదటిది పంటలు వేసుకోవడానికి పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులు తగ్గినప్పుడు అప్పడు రైతులకు లాభాలు వస్తాయి. ఆ దిశగా రైతుల ఖర్చులు తగ్గించే దిశగా మనం ఏం చేస్తామంటే..
– రైతులకు 9 గంటలకు ఉచిత కరెంటు పగటి పూట ఇస్తాం. దీని వల్ల ప్రతి రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి
– రాష్ట్రంలో ఏ రైతుకు కూడా బ్యాంకుల్లో వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకులు వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తున్నాయి. మన ప్రభుత్వం వచ్చాక ఖర్చులు తగ్గించేందుకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించి తోడుగా ఉంటాం. దీని వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.
– మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి రైతు వ్యవసాయం చేసేందుకు జూన్‌ మాసంలో రెడీ అవుతారు. పెట్టుబడుల కోసం అప్పలు చేస్తారు. అలాంటి రైతులకు పెట్టుబడి కింద ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 ఇచ్చి తోడుగా ఉంటాం.  ఒక్కసారి ఈ డబ్బులు వస్తే ఎకరా పొలం ఉన్న రైతుకు పెట్టుబడులకు 90 శాతం వచ్చినట్లే. రెండెకరాలు ఉన్న రైతుకు 40 శాతం పెట్టుబడికి అవసరం వస్తాయి.
– రైతులు బోర్లు వేసిన ప్రతి సారి ఫెయిల్‌అయి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి రైతుకు తోడుగా ఉండేందుకు ఉచితంగా బోర్లు వేయిస్తామని మాట ఇస్తున్నారు. రైతులకు పెట్టుబడులు తగ్గించేందుకు మనం బోర్లు వేయిస్తాం.
– రైతులు కష్టపడి తన పంట అమ్ముకోలేని సమయంలో సమస్య వస్తోంది. నాలుగేళ్లుగా ఏ రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఏ పంట తీసుకున్నా ఇదే పరిస్థితి. మిర్చికి మద్దతు ధర ఇవ్వాలని నేను వచ్చి ధర్నా చేసే వరకు ప్రభుత్వం స్పందించలేదు. రైతులు పంట వేసే ముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.
– పంట చేతికి వచ్చిన తరువాత అనుకోకుండా అకాల వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా రైతులు నష్టాల ఊబిలో పడిపోతారు. అలాంటి రైతులకు తోడుగా ఉండేందుకు ప్రకృతి వైఫరీత్యాల నిధి రూ.4 వేల కోట్లతో ఏర్పాటు చేసి రైతులకు తోడుగా ఉంటాను. 
– రైతులకు సాగునీరు సమయానికి వస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నాలుగేళ్లుగా ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇవన్నీ చేసి రైతులకు తోడుగా ఉంటాను.
– రైతులకు వ్యవసాయంతో పాటు పాడి ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట. కవ్వమాడే ఇంట కరువు ఉండదట అన్న సామెత ఉంది. ప్రతి రైతుకు పాడి ఆవులు, గేదెలు సబ్సిడీలో పంపిణీ చేస్తాం. కో–ఆపరేటివ్‌ రంగంలో పాలకేంద్రాలు ఉంటే రైతులకు మేలు జరుగుతుంది. చంద్రబాబు పాలనలో కో–ఆపరేటివ్‌ డయిరీలు మూతపడుతున్నాయి. హెరిటేజ్‌ డయిరీకి లాభాలు రావాలి కాబట్టి రైతులకు రేటు రాకుండా దగ్గరుండి దగా చేస్తున్నారు. ఆ ప్రతి రైతుకు హామీ ఇస్తున్నాను. కో–ఆపరేటివ్‌ రంగంలోని డయిరీలను పునరుద్ధరిస్తానని, ప్రతి లీటర్‌కు రూ.4 సబ్సిడీ ఇచ్చి తోడుగా ఉంటాను. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు చేసే కార్యక్రమాలు చెప్పాను. ఇందులో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికి తెలుసు. అర్జీలు ఇవ్వవచ్చు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరునా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.. 


 
Back to Top