చంద్రబాబును చెప్పులతో తరిమికొట్టండి

() అవినీతిలో కూరుకుపోయిన బాబు ప్రతిజ్ఞలా

() ప్రజలను ఘోరంగా అవహేళన చేస్తున్నాడు

() ప్రజలతో ప్రమాణం చేయించే నైతిక హక్కు బాబుకు లేదు

() అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నాడు

() అనంతపురం జిల్లా పర్యటనలో జననేత వైయస్ జగన్ మండిపాటు

 అనంతపురం) నిండా అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు...నవనిర్మాణ దీక్ష పేరుతో
అవినీతి రహిత రాష్ట్రం కోసం పాటు పడాలంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం విడ్డూరమని
ప్రతి పక్ష నేత,
వైయస్సార్సీపీ
అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకొని ఆ అవినీతి
సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన
చంద్రబాబుకు...ప్రజలతో ప్రమాణం చేయించే నైతిక హక్కు ఎక్కడిదని నిలదీశారు.
చంద్రబాబు ప్రజలను ఘోరంగా అవహేళన చేస్తున్నాడని  వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం
చేశారు. ఐదోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా రెండో రోజు వైయస్ జగన్ తాడిపత్రిలో
పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే...

 దొరికిన దొంగ

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయల బ్లాక్ మనీ సూట్
కేసులిస్తూ పట్టుబడ్డారు. ఆ గొంతు చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో
నిర్ధారణ అయ్యాక కూడా..బాబు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అవహేళన చేస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకున్న అవినీతి సొమ్ముతో ...పట్టపగలే ప్రజలు
చూస్తుండగానే ఎమ్మెల్యేలకు రూ.30 నుంచి 40
కోట్లు ఇచ్చి
కొనుగోళ్లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నాడు. చంద్రబాబుకు ఎక్కడి నుంచి
వస్తుంది ఇంత సొమ్ము. ఇప్పటికే 17మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇంకా కొనుగోళ్లు చేసే ప్రయత్నాలు
చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఎమ్మెల్యేల రేటు రూ. 50 కోట్లు అంటున్న మాటలు వింటున్నాం. ఎక్కడి
నుంచి వస్తోంది ఈసొమ్మంతా . ఇలాంటి పెద్దమనిషి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు.
ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా  

అన్నింటా అవినీతే

ఇసుక నుంచి బొగ్గు కొనుగోళ్ల దాకా...కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి రాజధాని భూముల
దాకా అంతా అవినీతే. చివరకు అవినీతి ఏ స్థాయిలో ఉందంటే దేవుని భూములు సైతం తన
బినామీలకు తక్కువ రేట్లకు కట్టబెడుతున్నారు . తద్వారా వందల కోట్ల రూపాయలు
చంద్రబాబు తన జేబుల్లో నింపుకుంటున్నాడు. చెన్నైలోని  వేల కోట్ల రూపాయలు
పలికే అమరేశ్వరుడి భూములని కేవలం రూ.  22 కోట్లకే బాబు తన బినామీలకు
అమ్ముతున్నాడంటే..ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి మరొకరు ఉంటారా. గుడిని, గుడిలో లింగాన్ని సైతం మింగేసే చంద్రబాబు
 అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరం. ఆఖరికి  పిల్లల చేత కూడా ప్రతిజ్ఞ
చేయిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయమని చెబుతున్నాడంటే...ఇంతకన్నా
దారుణం మరొకటి ఉండదు. 

 రుణమాఫీ బూటకం

చంద్రబాబు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొడితేగానీ అప్పుడు ఆయన చెప్పింది జరుగుతుంది.
 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈరెండేళ్లలో చేయని మోసం లేదు.  ఎన్నికలకు
ముందు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు. రుణాలు
మాఫీకాకపోవడంతో  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 87 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ అన్నాడు. 87వేల కోట్లపైన  అపరాధ వడ్డీతో కలిపి రైతుల
దగ్గరి నుంచి  బ్యాంకులు ముక్కు పిండీ వసూలు చేస్తున్నాయి. ఈపెద్దమనిషి చేసిన
మాఫీ ఆవడ్డీల్లో మూడోవంతు కూడా సరిపోలేదు. అలాంటిది రుణాలన్నీ  మాఫీ అయ్యాయని
నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. ఇలాంటి మనిషికి నవనిర్మాణ దీక్షలో ప్రతిజ్ఞ
చేయమని చెప్పే నైతిక హక్కు ఉందా అని నేనడుగుతున్నా.

దారుణమైన అబద్దాలు చెబుతున్నాడే

ఇక్కడే ఉన్న చేనేత కార్మికుడి ఇంటికి వచ్చి అడగండి. రూ. 40 వేలు చేనేత కార్మికుడికి రుణాలు ఉన్నాయి. అవి
మాఫీ కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి.  కష్టపడి పనిచేస్తే తప్ప
కడుపు నిండని పరిస్థితి డ్వాక్రామహిళలది. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అన్నాడు. మాఫీ
కాదుకదా అదనంగా రూ. 2
వడ్డీలు
కడుతున్న పరిస్థితి. రుణాలు మాఫీ చేయకపోగా ముష్టివేసినట్లు మూడు వేల రూపాయలు
ఇప్పిస్తానని చెబుతున్నాడు.  ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా. ఇంత
దారుణంగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా..?  

పాలనంతా మోసం, అబద్దాలు

ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి  కావాలి అన్నాడు. జాబు
లేనివారికి నెలకు రూ. 2
వేల నిరుద్యోగ
భృతి అన్నాడు. ఎన్నికలయ్యాక ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు.
అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశాడు. ఈమాదిరిగా ప్రతిజ్ఞ చేయమని చెప్పే నైతిక హక్కు
ఉందా అని బాబును అడుగుతున్నా . బాబు పాలనంతా మోసం, అబద్దాలు తప్ప ఏమీ లేదు. ఆనాడు అడ్డగోలుగా
దగ్గరుండి చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టించారు.  హోదా తెస్తామని చెప్పారు.
హోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇవ్వాలని చెప్పిన...ఈపెద్దమనిషి  ఇవాళ హోదాను
నీరుగారుస్తున్నాడు. 

బాబుకి భయం

కృష్ణా,
గోదావరి నదులపై
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ లు కడుతుంటే...ఏపీకి నీళ్లు రావని తెలిసీ కూడా
కేసీఆర్ ను మాట కూడా అడగడం లేదు. కారణం అడిగితే కేసీఆర్ ఎక్కడ ఓటుకు నోట్లు కేసు
బయటకు తీసి జైల్లో పెడతాడని భయం. అటు కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటామని అల్టిమేటం
ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కారణమేమంటే బాబు రెండేళ్ల అవినీతిపై మోడీ  సీబీఐ
ఎంక్వైరీ వేయిస్తాడని భయం.  అక్రమ ప్రాజెక్ట్ లపై కేసీఆర్ ను అడగడు. హోదాపై
 మోడీని నిలదీయడు. చివరకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరని
పరిస్థితి.  

రాజీలేని పోరాటం

రాష్ట్ర ప్రయోజనాల గురించి పోరాటం చేసేటప్పుడు కాంట్రాక్టర్ లు బలికావచ్చు.
రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎవరి కోసమో అడుగులు వెనక్కి వేయం.
 చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ది లేదు.  కొనుగోలు చేసిన
ఎమ్మెల్యేలను బాబు ఎందుకు డిస్ క్వాలిఫై చేయడం లేదు.  వారిచేత ఎందుకు
రాజీనామా చేయించడం లేదు. ప్రజల తీర్పు ఎందుకు కోరడం లేదు. నైతిక విలువలు మర్చిపోయి
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దిక్కుమాలిన పరిస్థితిలో బాబు ఉన్నాడు. వారిని
తీసుకొని ప్రజల దగ్గరకు పోయి ఓట్లు వేయమని అడిగే పరిస్థితిలో లేరంటే...ఆయన పాలన
మీద ఆయనకే నమ్మకం లేదని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు.

అని వైయస్ జగన్ పేర్కొన్నారు.   

 

Back to Top