వైయస్ జగన్ రైతు పోరు

()గిట్టుబాటు ధర కోసం వైయస్సార్సీపీ పోరుబాట
()వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనంపై వైయస్ జగన్ దీక్ష
()రైతుల ఇబ్బందులు పట్టని సర్కార్
()గుంటూరు వేదికగా రెండ్రోజుల పాటు ప్రతిపక్ష నేత దీక్ష

గుంటూరు : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆరుగాలం శ్రమించి పండిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ చోద్యం చూస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర కోసం వైయస్సార్సీపీ పోరుబాట పట్టింది.  ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, రైతులకు మద్దతుగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు సిద్ధమయ్యారు. గుంటూరు వేదికగా ఈనెల 26, 27 తేదీలలో రెండ్రోజుల పాటు దీక్ష చేయనున్నారు. పంటలు చేతికి వచ్చి రైతులు అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించడంతో అన్నదాత విలవిలలాడుతున్నాడు. ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలన్న ధ్యాసే లేకుండా పోయింది. మొద్దునిద్రపోయిన సర్కార్ ను తట్టిలేపేందుకు వైయస్ జగన్ దీక్ష చేపడుతున్నారు. 

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పతనం అవుతున్నాయి. దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. ధరలు లేకపోవడంతో ఇద్దరు మిర్చి రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వైయస్ జగన్ మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి రంగంలోకి దిగాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీక్షా స్థలాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. స్థలాన్ని నిర్ణయించిన తర్వాత పోలీసుల అనుమతి తీసుకుని అప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారు. రైతుల ప్రయోజనాల కోసం వైయస్ జగన్ తీవ్రంగా పోరాడుతున్నారు. 
Back to Top