విశాఖ చేరుకున్న వైఎస్ జగన్

విశాఖపట్నంః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో జననేతకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ మిందిలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ముఖ్యనేతలతో సంభాషణ అనంతరం అచ్యుతాపురం ఎస్ ఈజడ్ కు చేరుకుంటారు. బ్రాండిక్స్ ఉద్యోగులను కలుసుకొని వారి సాధకబాధలను అడిగి తెలుసుకుంటారు.

Back to Top