వరంగల్ లో జననేతకు ఘనస్వాగతం

వైఎస్ జగన్ రాకతో ఊపందుకున్న ప్రచారం..
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం..
జననేత కోసం తరలివచ్చిన జనం..

వరంగల్ః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరంగల్ జిల్లా పాలకుర్తి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు.  బతుకమ్మలు, బోనాలు, డప్పు వాయిద్యాలతో  వైఎస్ జగన్ కు జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. తనను ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ....  జగన్ ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించారు. వైఎస్ జగన్ రాకతో పార్టీనేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. 

వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ గెలుపే లక్ష్యంగా ....వరంగల్ లోక్ సభ సెగ్మెంట్లలో వైఎస్ జగన్ నేటి నుంచి ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తారు. నాలుగురోజుల పాటు జిల్లాలో విసృతంగా పర్యటిస్తారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా పాలకుర్తి చేరుకున్న వైఎస్ జగన్ ..అక్కడి నుంచే ప్రచారభేరి ప్రారంభించారు. రోడ్ షో నిర్వహించారు. పాలకుర్తి, జఫర్ గఢ్, వర్ధన్న పేట, రాయపర్తి, తొర్రూరు, హన్మకొండల మీదుగా.. 101 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ రోడ్ షో ఉంటుంది. ఆతర్వాత సాయంత్రం తొర్రూరు లో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.  


రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం హన్మకొండ, ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, భూపాలపల్లి, పరకాల, హన్మకొండల్లో వైఎస్ జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు.  సాయంత్రం పరకాల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బుధవారం హన్మకొండతో పాటు, సంగెం, గీసుకొండ ప్రాంతాల్లో ప్రచారం మీద ద్రష్టి పెడతారు. గురువారం హన్మకొండ నుంచి నయీం నగర్, కేయూ క్రాస్ రోడ్, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, స్టేషన్ ఘన్ పూర్, రఘునాథ్ పల్లి లలో ప్రచారం నిర్వహిస్తారు.

దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని జననేత ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు, ప్రస్తుత అధికార పార్టీలు..పథకాలను ఏవిధంగా తుంగలో తొక్కాయో ప్రజలకు వివరిస్తారు. రాజన్న పథకాలన్నీ మళ్లీ ప్రజలకు చేరువకావాలంటే..ఆయన ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీతోనే సాధ్యమని ప్రజలంతా ఇప్పటికే విశ్వసిస్తున్నారు. ఇదే క్రమంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లాసూర్యప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్ జగన్ వరంగల్ ఓటర్లకు పిలుపునిస్తున్నారు. 

Back to Top