అభిమాన హారతి


- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్న కోన‌సీమ ప్ర‌జ‌లు
తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ క‌ష్టాలు తెలుసుకునేందుకు వ‌చ్చిన రాజ‌న్న బిడ్డ‌కు స్థానికులు ఎదురెళ్లి మ‌రీ అత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. పల్లె పల్లెలు కదలి వచ్చి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. రహదారులన్నీ సంకల్పయాత్రలో కలిశాయి. చిన్నా పెద్దా..ముసలీ ముతకా చేయి చేయి కలిపి పాదయాత్రలో భాగస్వామ్యులవుతున్నారు. సమస్యలు ఆలకించేందుకు వచ్చిన రాజన్న బిడ్డకు అభిమాన హారతి పట్టారు. జననేతను చూసేందుకు ఎగబడుతున్నారు. రోడ్డు కిరువైపులా అభిమాన జనం బారులు తీరుతోంది. అందరికీ అభివాదం చేస్తూ వైయ‌స్ఆర్‌  సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదులుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ఇవాళ  ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి  పాదయాత్రను ప్రారంభించి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెంలో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.   

దారి పొడ‌వునా స‌మ‌స్య‌లు వింటూ..
చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ప‌చ్చ‌నేత‌ల‌ వేధింపులు, వేదనలు, రోధనలు ...బరువెక్కిన గుండెలతో...భారమైన జీవనంతో సతమతమవుతోన్న ప్రజలతో వైయ‌స్ జ‌గ‌న్‌ మమేకమవుతున్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు.  పాదయాత్ర పొడవునా ప్రజలు సమస్యలు విన్నవించుకున్నారు. రోజంతా ప్రతి చోటా ప్రజలతో మమేకమై వారి కష్టాలు తెలుసుకుంటున్నారు.  పాదయాత్ర ఆద్యంతం ప్రజలు తండోపతండాలుగా కదలివస్తున్నారు. జగనేతను కలిసి సమస్యలను ఏకరువుపెట్టారు. టీడీపీ పాలనలో పడుతున్న బాధలను చెప్పుకుంటున్నా రు.  వైయ‌స్ఆర్‌సీపీకి అండగా ఉన్నామని టీడీపీ ప్రభుత్వ పథకాలు అందనీయకుండా చేస్తున్నారని, కార్పొరేషన్‌ రుణాలకు ఎంపికైన వారికి అన్యాయం చేశారని జననేత వద్ద వాపోతున్నారు.  వారి బాధలన్నీ ఆసాంతం విన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వచ్చేది రాజన్న రాజ్యమని, అందరి కష్టాలూ తీరతాయని భరోసా ఇస్తున్నారు. 
 
Back to Top