ట్యాక్సీ కార్మికుల హ‌ర్షం


-  టాక్సీ డ్రైవ‌ర్ల‌కు ఏటా రూ.10 వేలు ఇస్తామ‌న్న వైయ‌స్ జ‌గ‌న్‌
విశాఖ‌:  ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ..వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా నిలుస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామ‌న్న‌ది చెప్పేందుకు ఇప్ప‌టికే న‌వ‌ర‌త్నాలు ప్ర‌క‌టించిన వైయ‌స్ జ‌గ‌న్ ..పాద‌యాత్ర‌తో త‌న దృష్టికి వ‌చ్చిన ప‌లు స‌మ‌స్య‌ల‌పై వెనువెంట‌నే స్పందిస్తున్నారు. గ‌తంలో ఆటోడ్రైవ‌ర్ల‌కు ఏడాదికి రూ.10 వేలు చెల్లిస్తామ‌న్న జ‌న‌నేత తాజాగా ట్యాక్సీ కార్మికుల‌కు కూడా రూ.10 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న విశాఖ‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను టాక్సీ డ్రైవర్లు కలిశారు. అన్నా.. ఏదో కిందా మీద పడి ఉన్న ఆస్తులు అమ్ముకుని టాక్సీని కొనుక్కుని తిప్పుకుంటుంటే మా పరిస్థితి చూడండన్నా అని వారి సమస్యలను వివరించారు. ఊబర్, ఓలా అని పెద్ద సంస్థలు వచ్చాయన్నా, వాటితో మేమూ పోటీ పడాలంటన్నా.. ఎలా అన్నా బతికేది? అని అడిగారు. సొంత ఆటో ఉన్న ప్రతి కార్మికుడికీ నేను ఇంతకుముందే చెప్పా.. అదే మాదిరిగా ఇవాళ సొంత టాక్సీ ఉన్న ప్రతి కార్మికునికీ చెబుతున్నాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆటో కార్మికులకు ఇచ్చినట్టే టాక్సీ కార్మికులకూ ఏటా రూ.10 వేలు ఇస్తామని చెబుతున్నా. ఈ పోటీలో పేదవాడు బతకలేని పరిస్థితి. బతకాలి అంటే ప్రభుత్వ చేయూత ఉండాలి. చేయూత అందించాల్సిన ప్రభుత్వం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుంటే జరిమానా వేసే పరిస్థితిలో ఈ మానవత్వం లేని ప్రభుత్వం ఉందన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీపై ట్యాక్సీ డ్రైవ‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని, మా బ‌తుకులు మార్చుకుంటామ‌ని పేర్కొంటున్నారు.
Back to Top