సమైక్య ఉద్యమకారులకు జగన్‌ ఆదర్శం

తిరుపతి, 10 అక్టోబర్ 2013:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచంలంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం ఉద్యమకారులకు ఆదర్శంగా నిలుస్తున్నదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. ఈ నెల 19న హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో శ్రీ జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన 'సమైఖ్య శంఖారావం' సభ సమైక్యాంధ్ర ఉద్యమంలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. భూమన గురువారం తిరుపతిలో సరికొత్త రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోవడం వల్ల సీమాంద్రలో నిరుద్యోగం తాండవిస్తుందని, విద్యావంతులకు ఉద్యోగాలు దొరకవని ఆయన అన్నారు. నిరసనలో బాగంగా కరుణాకరరెడ్డి జనరేటర్ల విడిభాగాలను అసెంబుల్ చేశారు. విద్యావంతులంతా ఇతర చేతిపనులు చేసుకోవాల్సి  వస్తుందని ‌ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

Back to Top