వైయస్ జగన్ ప్రజల మనిషి

  • బాబువి అవకాశవాద రాజకీయాలు
  • నంద్యాలలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది
  • నీచ, దిగజారుడు రాజకీయాలు చేస్తోంది
  • బాబు చీప్ ట్రిక్స్ ను ప్రజలు తిప్పికొడతారు
  • ఆగష్టు 23న టీడీపీకి తగిన బుద్ధి చెబుతారు
నంద్యాలః అధికార టీడీపీ నంద్యాలలో నీచ, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. డబ్బులు, ప్రలోభాలు, బెదిరింపులతో ప్రభుత్వం నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఇంత అవకాశవాద రాజకీయాలు ఎక్కడ కూడ ఉండవన్నారు. నంద్యాలలో విలేకరుల సమావేశంలో బుగ్గన మాట్లాడారు. ప్రభుత్వ యత్రాంగం, వివిధ శాఖలు, పోలీసులంతా చంద్రబాబు దగ్గర పెట్టుకొని...వైసీపీ గొడవలు సృష్టిస్తుంది సంయమనం పాటించాలంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం దారుణమన్నారు. సీఎం తన హోదాకు తగిన విధంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికారు. టీడీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తుందనే, బాబు క్యాబినెట్ ను నంద్యాలలో దించిన రోజునే... వైయస్సార్సీపీ పార్లమెంటరీ బృందం నెలరోజుల కిందటే ఢిల్లీలో సీఈసీని ఆశ్రయించిందన్నారు. టీడీపీ ఏ స్థాయికైనా దిగజారే ప్రమాదముందని, శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకునే అవకాశముందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు విన్నవించినట్టుగా గుర్తు చేశారు. 

కావాలంటే నేను ఓటుకు రూ. 5వేలు ఇవ్వగలను. నా పెన్షన్ తీసుకొని , నా రోడ్ల మీద తిరుగుతూ నాకు ఓటేయకపోతే ఎలా అని ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని బుగ్గన అన్నారు. ప్రజల కట్టే పన్నులతోనే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి  తప్ప ఎవరో వేసే బిక్ష కాదని స్పష్టం చేశారు. ఎవరు కూడ ఇంట్లోంచి సొమ్ము తీసుకురారన్నారు. చంద్రబాబు అదేదో తన ఇంట్లోంచి ఇచ్చినట్టు మాట్లాడడం దారుణమన్నారు.  తూర్పు, పశ్చిమగోదావరి, బెంగళూరులనుంచి చదువుకునే పిల్లలను తీసుకొచ్చి సర్వేల పేరుతో టీడీపీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు ఓటు వేశారో తెలుస్తుంది, టీడీపీకి ఓటు వేయకపోతే రేషన్, పెన్షన్ లు రావంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి సర్వే చేస్తున్న పిల్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారన్నారు. టీడీపీ దుర్మార్గపు రాజకీయాలపై  బుడ్డా కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆయన మీదే కిడ్నాప్  కంప్లైంట్ పెట్టారన్నారు. అది అధికార దుర్వినియోగం కాదా బాబూ..? అని ప్రశ్నించారు. 

10రోజుల నుంచి వైయస్ జగన్ నిద్రాహారాలు మాని ఇటింటికీ వెళుతూ రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజలకు వివరిస్తున్నార్ననారు. బాబు లాగ మాకు గొడవలు చేసే అలవాటే ఉంటే నంద్యాలలో ఎందుకు తిరుగుతామని టీడీపీకి చురక అంటించారు.  మీలాగ కొందరు నాయకులని పెట్టి నడిపించేవాళ్లం కదా అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో ఉన్న ఓ టీడీపీ ఎమ్మెల్యే జై జగన్, జై వైయస్సార్ అని స్లిప్పులు కొట్టించి... డబ్బులు తెచ్చుకొమ్మని శిల్పా  సేవాసమితి  దగ్గరకు పంపడం సిగ్గుచేటన్నారు.  అన్నపూర్ణ హోటల్ లో పదిరూపాయల మిల్స్ , లిక్కర్ షాపుకు వెళితే క్వార్టర్ ఇలా మోసపూరిత ప్రకటనలతో టీడీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్నంతా వాడుతూ ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. సీఆర్పీని పంపించి టీడీపీకి ఓటేయకుంటే స్లిప్పు బయటకు వస్తది, మీ గురించి తెలుస్తుందంటూ పొదుపు సంఘాల మహిళలను భయపెడుతున్నారన్నారు. స్లిప్పు ఎవరి దగ్గరకు రాదని, అది ఈసీకి పోతుందని బుగ్గన స్పష్టం చేశారు.స్లిప్పును కూడ వాడుకొని బెదిరించడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. 

రాజధాని అంటే ఎంతపెద్ద ఎత్తున కడతాడో అనుకున్నామని, కానీ  బాబు రాజధాని అంతా  సూరజ్ గ్రాండ్ హోటల్ లోనే ఉందని బుగ్గన ఎద్దేవా చేశారు. మా దగ్గర డబ్బులున్నాయని తెలుగుదేశం క్యాడర్ కు సంకేతమిచ్చేందుకే..ఉద్దేశ్యపూర్వకంగా  బాలకృష్ణ వచ్చి పబ్లిక్ గా డబ్బులు పంచుతున్నాడని దుయ్యబట్టారు.  ప్రభుత్వం మాది, ఏమైనా చేస్తామన్న రీతిలో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. అందుకే బాబు ఓటుకు రూ.5వేలు ఇస్తానని మాట్లాడుతున్నాడన్నారు. ప్రజలకు దగ్గరకు కావాలి. తప్పుడు వాగ్ధానాలు ఇవ్వకూడదు. నిజమే పలకాలి. చెప్పిందే చేయాలన్నది వైయస్ జగన్ వ్యక్తిత్వమని బుగ్గన చెప్పారు. డబ్బులిచ్చి మనుషులను పంపించడం, జగన్ మీటింగ్ లకు జనం రాకుండా డబ్బులిచ్చి ఊరును దాటించడం టీడీపీ నైజమన్నారు. చంద్రబాబు తన  మంత్రులతో నంద్యాలలో వినూత్న పద్ధతులకు తెరదీస్తున్నాడని ఎద్దేవా చేశారు. నీలం సంజీవరెడ్డి, వెంకటసుబ్బయ్య లాంటి మహనీయులు పాలించిన గడ్డ నంద్యాల అని,  నంద్యాల ప్రజలు తెలివిగల వారని బుగ్గన అన్నారు. బాబు చీప్ ట్రిక్స్ , దిగజారుడు ఐడియాలను ఎవరూ నమ్మరన్నారు. ఆగష్టు 23న టీడీపీకి నంద్యాల ప్రజలు
తగిన గుణపాఠం చెబుతారన్నారు. 
Back to Top