అంబేద్కర్ కు నివాళులు అర్పించిన వైఎస్ జగన్

హైదరాబాద్) రాజ్యాంగ
నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు
వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బీ ఆర్
అంబేద్కర్ జయంతి వేడుకల్ని ఆయన నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి
ఘటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సూక్తులను స్మరించుకొన్నారు. ఎంత కాలం బతికాం
అన్న దాని కన్నా ఎంత గొప్పగా బతికాం అన్నది ముఖ్యం అన్న స్ఫూర్తి తీసుకోవాలని
సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 

Back to Top