మానవహారంలో పాల్గొన్న వైయస్‌ జగన్‌

గుంటూరు:

ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలను ఉధృతం చేస్తూనే ఉంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొమ్మూరులో ప్రజా సంకల్ప మానవహారంలో పాల్గొన్నారు. కొమ్మూరు ప్రజలంతా మానవహారంలో పాల్గొని ఎంపీల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

Back to Top