ప్రజాసంకల్పయాత్ర@60వ రోజు



- రాజ‌న్న బిడ్డ‌కు గ్రామ గ్రామాన బ్ర‌హ్మ‌ర‌థం
- అన్ని వ‌ర్గాల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్న జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌
చిత్తూరు: అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా ఇస్తున్నారు. అశేష జనసందోహం నడుమ కొనసాగుతున్న పాదయాత్ర నేడు 60వ రోజుకు చేరుకుంది. రాజన్న బిడ్డను చూడాలని, ఆయన చల్లని చూపులో పడాలని, ఎముక లేని చేతిని తాకాలనీ, ఆ మురిపెం పంచుకోవాలలని, కష్టాలు చెప్పుకోవాలని, సంకల్ప యాత్రలో భాగస్వాములవ్వాలని జనం ఆరాటపడుతున్నారు. పల్లెపల్లెనా ఉత్తుంగ తరంగమై బారులు తీరుతున్నారు. తనివి తీరా ఆత్మీయతను పంచుకుంటున్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ ప్రజా సంకల్ప యాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరిగింది. చిన్నాపెద్దా తేడా లేకుండా యువకులు, మహిళలు, వృద్ధులు సంకల్పయాత్రలో భాగస్వాములవుతున్నారు. వైయ‌స్‌ జగన్‌ వెంట అడుగులో అడుగు వేసి మద్దతు తెలియజేస్తున్నారు. ఇవాళ  ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పాత వేపకుప్పం శివారు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఎల్వీ పురం క్రాస్‌, నేతకుప్పం, తిమ్మరాజుపల్లి, గొల్లపల్లి, సి. కాలేపల్లికి చేరుకుంటుంది. 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం  మధ్యాహ్నం 3గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చిటతూరు, హరిజనవాడ, రాయలచెరువుల మీదుగా కుప్పం బాదురు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. దారిపొడవునా ఆయన ప్రజలతో మమేకం కానున్నారు. ఇప్పటివరకు వైయ‌స్‌ జగన్‌ 818.2 కిలోమీటర్లు నడిచారు. 


Back to Top