వైయస్‌ జగన్‌ పాదయాత్ర పార్టీకి బలం

హైదరాబాద్‌: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. రాష్ట్ర  ప్రజలను కలుసుకునే మంచి కార్యక్రమానికి వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు ప్రతి ఒక్కరికీ అందించడమే కాకుండా ప్రజలకు కావాల్సిన మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందన్నారు. అంతే కాకుండా కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన చంద్రబాబు పరిపాలనను ప్రజల్లో ఎండగట్టడం, వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అనే అంశాలపై వివరించనున్నారని చెప్పారు. 

Back to Top