<br/><br/>శ్రీకాకుళం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా అట్టలి క్రాస్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం.. పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను జననేత గుర్తుచేసుకున్నారు. ఇవాళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని అట్టలి నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి తమరాడ, తంపటాపల్లి క్రాస్, ఎల్‌ఎల్ పురం మీదుగా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వైబస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్‌లో జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. <br/><br/>