దేశ అత్యంత శక్తిమంతుల జాబితాలో జగన్

న్యూఢిల్లీ :

దేశంలోని అత్యంత శక్తిమంతులైన వారి జాబితాలో మన రాష్ట్రం నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి స్థానం లభించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద ఇండియన్ ఎక్సుప్రెస్’ రూపొందించిన ఈ జాబితాలో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి 21వ స్థానంలో నిలిచారు. 2013లో 36వ స్థానంలో నిలిచిన శ్రీ జగన్ ఈ ఏడాది 21వ స్థానానికి దూసుకెళ్ళారు.

తొలి స్థానంలో నరేంద్ర మోడీ, రెండవ స్థానంలో రాహుల్ గాంధీ, మూడ‌వ స్థానంలో సోనియా గాంధీ, నాలుగవ స్థానంలో కేజ్రీవాల్, ఐదవ స్థానంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర‌వ స్థానంలో జయలలిత (తమిళనాడు సీఎం), ఏడవ స్థానంలో మమతా బెనర్జీ (బెంగాల్ సీఎం), ఎనిమిద‌వ స్థానంలో మాయావతి (బీఎస్పీ), తొమ్మిదవ స్థానంలో చీఫ్ జస్టి‌స్ పి.సదాశివం, పద‌వ స్థానంలో మోహన్‌ భగవత్ (ఆర్‌ఎస్‌ఎస్), 11వ స్థానంలో రాజ్‌నాథ్‌ సింగ్ (బీజేపీ), 12వ స్థానంలో శరద్ యాదవ్‌ (జేడీయూ), 13వ స్థానంలో సుష్మా స్వరాజ్ (బీజేపీ) నిలిచారు.

ఆ తరువాతి స్థానాల్లో అరుణ్ జైట్లీ, ఎల్.కె.అద్వానీ, రఘురాం రాజన్, పి.చిదంబరం, అమి‌త్‌షా, ముఖేశ్ అంబానీ, నవీ‌న్ పట్నాయక్,‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నిలిచారు. ఈ జాబితాలో ప్రధాని మన్మోహన్‌సింగ్ 57వ స్థానంతో సరిపెట్టుకున్నారు. గత ఏడాది ప్రకటించిన జాబితాలో ఆయన 4వ స్థానంలో ఉండడం గమనార్హం.

శాసనసభ ఎన్నికల్లో జగన్ స్వీప్‌ :
త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రలో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి స్వీప్ చేయనున్నారని ద ఇండియన్‌ ఎక్సుప్రెస్‌ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల కన్నా మెరుగైన ఫలితాలు సాధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో శ్రీ జగన్ కీలకపాత్ర పోషించనున్నారని ద ఇండియన్ ఎ‌క్సుప్రెస్‌ తెలిపింది. ఇతర పార్టీల నుంచి వైయస్ఆర్‌సీపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారని పేర్కొంది.

Back to Top