ఉద్యోగులకు వైయ‌స్ జ‌గ‌న్‌ బాసట

- సీపీఎస్ విధానం ర‌ద్దు చేస్తాన‌ని హామీ
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఉద్యోగుల మ‌ద్ద‌తు 
 
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా :  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)తో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీరుస్తామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం  వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి.. ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం  ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్యోగులు..వైయ‌స్‌ జగన్‌ను కలిసి తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ వారితో పాటు ఫ్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేస్తూ సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులను తమ కుటుంబంలో ఒక భాగంగా చూస్తామన్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ హామీతో ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి జ‌న‌నేత వెంట న‌డిచారు.
Back to Top