పాశర్లపూడి బాడవ నుంచి ప్ర‌జాసంకల్పయాత్ర ప్రారంభం

 


తూర్పు గోదావ‌రి : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత వైయ‌స్‌ జగన్‌ 199వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి ప్రారంభించారు. అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్‌ చేరుకుని, అక్కడ నుంచి అమలాపురం మండలం పెరూరు, పెరూరుపేట వై జంక్షన్‌ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం రాజన్న బిడ్డ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి కొంకపల్లి, అమలాపురం వరకు 199వ రోజు పాదయాత్ర సాగనుంది. అమలాపురంలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు.

వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 

 


Back to Top