హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ

న్యూఢిల్లీ) కేంద్ర హోమ్
మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సమావేశం అయ్యారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు ఉన్నారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు చేస్తున్న అరాచకాల్ని,
అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటాన్ని ఆయన కు వివరించారు. చంద్రబాబు ఎంపరర్
ఆఫ్ కరప్షన్ అనే పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందచేశారు. వైఎస్ జగన్
అందించిన వివరాల్ని రాజ్ నాథ్ సింగ్ సావధానంగా విన్నారు. అనంతరం సమావేశం వివరాల్ని
వైఎస్ జగన్ మీడియాకు వివరించారు. 

Back to Top