హైదరాబాద్: విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నానికి గురైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు బంధువులు, నిమ్మకూరు గ్రామస్తులు సోమవారం పరామర్శించారు. నందమూరి ప్రభు, నందమూరి వెంకటేశ్వరరావు, నందమూరి శ్రీనివాసరావులు హైదరాబాద్‌లోని వైయస్ జగన్ ఇంటికి వచ్చారు. వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వైయస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ హత్యాయత్నానికి తెగబడ్డారని, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై కేంద్రం ప్రత్యేక స్వతంత్య్ర సంస్థతో సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండు చేశారు.