కిడ్నీ బాధితులతో వైయస్ జగన్ ముఖాముఖి

శ్రీకాకుళంః జిల్లాలో రెండో రోజు వైయస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాసేపట్లో కవిటి మండలం, జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో వైయస్ జగన్ సమావేశమవుతారు. స్వయంగా వారి బాధలు అడిగి తెలుసుకొని వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. స్థానికంగా వేలాదిమంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ కోసం విశాఖకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.  పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పరిశోధన కేంద్రం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top