కేర‌ళ ప్ర‌మాదంపై దిగ్భ్రాంతి


కొల్లాం: కేరళ ఆల‌యంలో జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మాదంపై వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ తీవ్ర‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కేరళలో కొల్లమ్ జిల్లా పుట్టింగళ్ దేవీ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 100 మందిపైగా మృతి చెందారు. 200 మందిపైగా గాయపడ్డారు. బాణాసంచా పేలుడు ధాటికి ఆలయం ప్రాంగణంలోని కట్టడ0 కుప్పకూలింది.  క్షతగాత్రులను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
 ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. పేలని బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  
ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మృతుల కుటుంబాలకు వైఎస్ జ‌గ‌న్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
Back to Top