దర్శిలో అడుగుపెట్టిన జననేతప్రకాశం: సంతనూతనపాడు నియోజకవర్గ చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం శివారు నుంచి ప్రారంభమైన 102వ రోజు ప్రజా సంకల్పయాత్ర దర్శి నియోజకవర్గానికి చేరింది. దర్శిలోని శివరాంపురంలోకి వైయస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్త జననేతకు ఘనస్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనలతో వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించారు. మహిళలు రాజన్నబిడ్డకు హారతులు ఇచ్చారు. నాలుగేళ్లుగా టీడీపీ పాలనలో తాము పడ్డ కష్టాలను జననేతకు ప్రజలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా శివరాంపురంలో వైయస్‌ జగన్‌ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్టీ జెండాను ఎగురవేశారు. 

తాజా ఫోటోలు

Back to Top