హైదరాబాద్: వరద ప్రాంతాల్లో సహాయ చర్యల్ని ముమ్మరం చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రాయల సీమ ప్రాంతంలో అపార పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు ఐదుగురు ప్రాణాలో కోల్పోయినట్లు సమాచారం. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సంతాపం తెలియ చేశారు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాలు పంచుకోవాల్సిందిగా పార్టీ నాయకులు, కార్యకర్తల్ని జగన్ ఆదేశించారు.