రైతుల‌ను త‌క్ష‌ణ‌మే ఆదుకోవాలి


 హైదరాబాద్‌ : అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతులను తక్షణమే ఆదుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ప్రత్యేక నిధులను విడుదల చేసిన రైతులకు నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు మృత్యువాత పడటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, వారికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు. బాధితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలకు తీవ్ర కష్టాల్లో పడ్డ రైతన్నలకు సాయంగా నిలవాలని వైయ‌స్ఆర్‌ సీపీ పార్టీ కేడర్‌కు వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. 

 

Back to Top