దుర్గారావు మృతిపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి


తూర్పు గోదావరి:. హోదా పోరులో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త అమరుడు అయ్యారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త దుర్గారావు గుండెపోటుతో మృతి చెందడం పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గారావు కుటుంబానికి వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసుల చర్యలను వైయస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్‌లో పాల్గొన్న బుట్టాయి గూడెం కృష్ణాపురం వాసి కాకి దుర్గారావును ఇవాళ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌లో దుర్గారావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తెల్లంబాలరాజు, తదితరులు మృతుడి స్వగృహానికి చేరుకొని నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు.

 
Back to Top