మీడియాతో వైయస్ జగన్ చిట్ చాట్

అమరావతిః ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తాను నీతివంతుడినంటూ నీతులు వల్లించడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కొనుగోళ్లు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరిని బెదిరించి, మరికొందరిని ప్రలోభపెట్టి బాబు నీచ స్థాయికి దిగజారారని ధ్వజమెత్తారు. ఒక్కో ఎంపీటీసీ, జడ్పీటీసీకి 20నుంచి 20 లక్షలు ఇచ్చారని విమర్శించారు. కోట్లు వెచ్చించి మేమే గెలిచామని బాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అలా గెలవడం ప్రజల అభిప్రాయమా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజల్లోకి ఏం సందేశం పంపుతున్నారని బాబుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఓ గెలుపు అనుకుంటే పార్టీ మారిన 21మందిపై అనర్హత వేటు వేసి ఉపఎన్నికలకు రావాలని వైయస్ జగన్ బాబుకు సవాల్ విసిరారు. వాళ్లను మళ్లీ పోటికి పెడితే దాన్ని మేం రెఫరెండంగా స్వీకరిస్తామని చెప్పారు. 

Back to Top