దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా మాధ‌వ్‌


 ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ప్రకటించారు. దర్శి అభ్యర్థిగా మాధవ్‌ పేరును ఆయన ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాళ్లూరు బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. మాధవ్‌ను అందరూ ఆదరించాలని వైయ‌స్‌ జగన్‌ ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది.  

Back to Top