చిత్తశుద్ధి లేని ప్రభుత్వం..!

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. స్థానికంగా అవినాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రాయలసీమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతుంది ఒక్క వైెస్సార్సీపీ మాత్రమేనని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కనీస నీటిమట్టం ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ప్రజలు వైరల్ ఫీవర్స్ తో బాధపడుతుంటే చోద్యం చూస్తున్నారని అవినాష్ రెడ్డి దుయ్యబట్టారు. జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని వాటి నివారణపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.
Back to Top