వైయస్సార్సీపీలో చేరిన యువనాయకులు

తూర్పుగోదావ‌రి :  పెద్దాపురం పట్టణంలో పెద్ద ఎత్తున యువకులు వైయస్సార్సీపీలో చేరారు.  వైయస్సార్సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. కొత్తపేట, 28వ వార్డుకు చెందిన నేల ప్రసాద్‌ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు పార్టీలో చేరారు. వైయ‌స్ఆర్‌ సీపీ యువజన విభాగం నాయకులు శివ, గోపు మురళీ, శేషుల సమక్షంలో  వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహానేత  వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన కోసం శ్రమిస్తున్న వైయస్ జగన్‌ వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు.  పార్టీలో చేరిన యువకులందరికీ సుబ్బారావు నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

అనంతరం గడపగడపకూ వైయ‌స్ఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిగిని వీరభద్రరావు, కంటే వీర్రాఘవరావు, ఆవాల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి రమేష్‌రెడ్డి, పార్టీ పట్ణణశాఖ అధ్యక్షులు కాపగంటి కామేశ్వరరావు, పట్టణ నాయకులు నాగిరెడ్డి వాసు, సకురు ప్రసాద్, జిగిని రాజుబాబు, వుద్దగిరి సతీష్, కౌన్సిలర్‌ వాసంశెట్టి గంగ, రాజు అ ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో కొంతమంది టీడీపీకి చెందిన యువకులు కూడా ఉన్నారు. పార్టీలో చేర‌డానికి ఇంకా ప‌లువురు కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని వారు తెలిపారు.
Back to Top