వైయస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చరౌడీల దాడి

అనంతపురంఃధర్మవరంలో టీడీపీ నేతలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. శుక్రవారం ఉదయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై రాడ్లు, వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడి ఘటనలో నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స ని​మిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Back to Top