టీడీపీది దిగజారుడు రాజకీయం

హైదరాబాద్) చంద్రబాబు తప్పుల్ని ప్రశ్నించినందుకు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని
మహిళా ఎమ్మెల్యే రోజా అభిప్రాయ పడ్డారు. టీడీపీ వి దిగజారుడు రాజకీయాలు అని ఆమె
అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో
ఆమె మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, సెక్సు రాకెట్
పూర్వాపరాల్ని ఆమె వివరించారు.

          అంబేద్కర్ ను తామెంతో
గౌరవిస్తామని, అయినా సరే ఆయన పేరుతో సభలో టాపిక్ ను డైవర్ట్ చేశారని ఆమె గుర్తు
చేశారు. రాజధాని విషయంలో శివరామక్రిష్ణన్ కమిటీ అబిప్రాయాల్ని పరిగణనలోకి
తీసుకోలేదని చెప్పారు. కాల్ మనీ సెక్సు రాకెట్ గురించి ప్రశ్నించినందుకే తనను
సస్పెండ్ చేశారని, ఇదే పదంతో హెడ్డింగ్ పెట్టిన ఈనాడు మీద చర్యలు తీసుకోలేదని
అభిప్రాయ పడ్డారు. 50 మంది ఈ విధంగా నినాదాలు ఇస్తే పట్టించుకోలేదని, కానీ తన
ఒక్కరి మీదనే చర్యలు తీసుకొన్నారని రోజా గుర్తు చేశారు. 


To read this article in English:    http://goo.gl/qi397o

తాజా ఫోటోలు

Back to Top