టీడీపీ పాలనలో అన్నీ సమస్యలే...

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి విక్రమపురం మహిళలు గోడు..
శ్రీకాకుళంఃటీడీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు అందడం లేదని పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం విక్రమపురం గ్రామ మహిళలు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ  కాలేదని,పింఛన్లు అందడంలేదని పలు సమస్యలను వైయస్‌ జగన్‌కు విన్నవించారు. టీడీపీ కార్యకర్తలకు తప్ప మిగిలినవారికి సంక్షేమ పథకాలు అందడం లేదని మండిపడ్డారు. కాల్వల ఆ«ధునీకరణ చర్యలు చేపట్టలేదని, కాల్వల్లో పూడికలు పెరిగిపోవడంతో సాగునీరు అందడంలో ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. లక్షలు డిపాజిట్లు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అగ్రిగోల్డ్‌ బాధితులు తెలిపారు. వైయస్‌ జగన్‌ వస్తే అన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలో  తాగునీరు సమస్యతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తిత్లీ తుపాన్‌ పరిహారం కూడా పూర్తిగా అందలేదన్నారు. వైయస్‌ జగన్‌ వస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top