వైయస్‌ఆర్‌ రూపంలో ఆయన కొడుకొచ్చారు




వైయస్‌ జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడతాం
ఈ చంద్రబాబు పాలన మాకొద్దు
విజయనగరం: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోలేదని, ఆయన రూపంలో వైయస్‌ జగన్‌ వచ్చాడని గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన ఓ మహిళ అన్నారు. ఆనందపురం వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా ఆనందపురంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. భూపాలపురం నుంచి వచ్చిన మహిళ మాట్లాడుతూ.. గ్రామంలో ఒకటి కాదు.. రెండు కాదు.. వంద సమస్యలు ఉన్నాయని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. అవి చూసినప్పుడల్లా వైయస్‌ఆర్‌ గుర్తుకు వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే హుద్‌ హుద్‌ తుఫాన్‌ తీసుకువచ్చారన్నారు. ఇప్పటికీ జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించలేదని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ హయాంలో ఫీజురియంబర్స్‌మెంట్‌తో అనేక మంది పిల్లలు ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు స్థిరపడ్డారన్నారు. కానీ ఇప్పుడు డాక్టర్, ఇంజనీరింగ్‌ చదవాలంటే లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వైయస్‌ఆర్‌ పాలనలో అర్హులైన అందరికీ పెన్షన్‌ వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే వెయ్యి రూపాయల పెన్షన్‌ పది మందికి మాత్రమే ఇస్తున్నారని, మిగిలిన 90 మంది ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు మాకు వద్దూ.. వైయస్‌ జగన్‌ కావాలి.. రావాలి.. ఆయన్ను సీఎం చేసేంత వరకు కష్టపడుతాం.. వైయస్‌ఆర్‌ రూపంలో ఆయన కొడుకు మా వద్దకు వచ్చారు. ఆయన్ను గెలిపించే వరకు పోరాడుతామని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top