తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా

తిరుపతి :  అధ్యక్షులు వైయస్ జగన్ నమ్మకాన్ని నిలబెడతానని  పార్టీ నేత పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి పార్టీ సమన్వయకర్తగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ బలోపేతమే తన ధ్యేయమన్నారు. కార్యకర్తలను కలుపుకుని పోయి పార్టీని ముందుకు తీసుకు వెళతానని ద్వారకానాథ్ పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తంబళ్లపల్లిలో వైయస్సార్సీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top