విభజనపై మౌనమేల!

అనంతపురం 06 ఆగస్టు 2013:

ప్రత్యేక రాష్ట్ర అంశంపై మౌనంగా ఎందుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును  మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసిన తర్వాతే విభజన గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో ఆయన మౌన వీడాలన్నారు. పదవీకాంక్షతోనే కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు నోరు మెదపడం లేదని విమర్శించారు.  వివేకానందరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. జిల్లాలో అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం.. హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని మడకశిర, కదిరి, పెనుకొండ, హిందూపురం శాసనసభ స్థానాల పరిశీలకుడిగా ఆయనను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నియోజకవర్గాల్లోనూ పార్టీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

తాజా ఫోటోలు

Back to Top