ఏది సత్యం.. ఏది అసత్యం..!

సీన్: 1) అసెంబ్లీలో జరిగిన సంవాదం గురించి చీఫ్
విప్ కాల్వ శ్రీనివాసులు వీడియో ఫుటేజీని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో
మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అనుమతితోనే వీటిని విడుదల
చేస్తున్నట్లు చెప్పారు. అందులో అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు నినాదాలు చేస్తున్న
భాగం వరకు మాత్రమే ఉంది. నిరసనలో భాగంగా అధికార పార్టీ నాయకుల మీద ప్రతిపక్ష
సభ్యుల ఆరోపణలు ఉన్నాయి.

సీన్: 2) అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై
స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీడియాతో మాట్లాడారు. వీడియో క్లిప్పింగ్ ల గురించి
తనకేమీ సంబంధం లేదని చెప్పారు. దురద్రష్టవశాత్తు సోషల్ మీడియాకు వచ్చాయన్నారు. పార్టీలు
అడిగితే వీడియో ఫుటేజీ ఇచ్చామన్నారు. కానీ వాటిని ఆయా పార్టీలు ఎలా
ఉపయోగించుకొంటాయనే దాని గురించి నేను చెప్పలేదు అని స్పీకర్ కోడెల చెప్పారు.

అసెంబ్లీ లో విడుదలైన ఫుటేజీ విషయంలో
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఇద్దరు నాయకుల ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. వీటిలో ఏది
సత్యం, ఏది అసత్యం అన్న సంగతి నిర్ధారణ కావటం లేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో
ఫుటేజీ బయటకు ఇచ్చారనేది వాస్తవం. ఇప్పుడు రక రకాల కారణాలు చెబుతున్నప్పటికీ
వాస్తవం ఇదే. కానీ, దీని విషయంలో కూడా ఒకరిపై ఒకరు చెప్పుకోవటం గమనించదగిన విషయం. 

Back to Top