శ్వేతపత్రం ఇస్తావా బాబూ.. ఎమ్మెల్యే ఆర్కే

హైదరాబాద్ః రాజధానిలో రైతుల నుంచి
దోచుకున్న భూములను విదేశీ కంపెనీలకు అమ్ముకుంటూ చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం
చేస్తున్నాడని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రైతులకు కమర్షియల్ , రెసిడెన్షియల్
భూములు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం...ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రైతులకు
ఇస్తామన్న 1700 ఎకరాల భూములను విదేశీ కంపెనీలకు అమ్ముకునేందుకు ప్రభుత్వం
చేసుకున్న రహస్య ఒప్పందాలు బయటపెట్టాలని ఆర్కే డిమాండ్ చేశారు. మాటిమాటికి
విమానాల్లో విదేశాలు తిరుగుతూ చంద్రబాబు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు
చేస్తున్నారని ఆర్కే ఆగ్రహం వెలిబుచ్చారు. రాజధానిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజెప్పాలని, శ్వేతపత్రం
విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Back to Top