'సమైక్యవాదులకు హాని తలపెడితే సహించం'

రాయచోటి 13 సెప్టెంబర్ 2013:

సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు వెళ్లే సమైక్యవాదులకు ఎటువంటి హాని తలపెట్టినప్పటికీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే జి.  శ్రీకాంత్‌ రెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి గౌరవం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను  మోసగించాలనుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాలనీ, ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారనీ కాంగ్రెస్, టీడీపీలను నిలదీశారు. తమ ఏకైక అజెండా సమైక్యాంధ్ర ప్రదేశ్ అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు స్వార్థం వీడి ఒక అజెండాకు కట్టుబడాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ఆర్ జిల్లా  రాయచోటిలో 6 రోజులుగా కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. గాలివీడులో విద్యార్థి సంఘం నాయకుల ఆమరణ నిరాహర దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రాయచోటిలో పోస్టల్ సిబ్బంది 30వ రోజు గాంధీ వేషధారణలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

Back to Top