ఊపిరి ఉన్నంత వరకు హోదా కోసం పోరు


హోదా ఉద్యమం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది
ప్రతి ఇంటి నుంచి ఉద్యమంలోకి తరలి రావాలి
వైయస్ ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ 

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడదామని, హోదా కోసం సాగిస్తున్న పోరులో ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చి పాల్గొనాలని వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపిలను ఆమె పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. ప్రత్యేక హోదా ఉద్యమం అనేది నిరాహార దీక్షలతో ఆగిపోదన్నారు.  
చంద్రబాబు నాయుడు సైతం భేషజాలను వీడి దీక్ష చేస్తున్న ఎంపిలతో కలిసి రావాలని ఆమె డిమాండ్‌ చేశారు. హోదా సాధన కోసం అన్ని సంఘాలు,పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై వత్తిడి తేవాలన్నారు. దీక్షా స్థలిలో విజయమ్మ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
–  ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపిలు, అందులో పాలుుపంచుకున్నంటున అందరికీ హృదయ పూర్వక అభినందలు. 
–  వైయస్‌ కుటుంబం దశాబ్దాలుగా వైయస్‌ కుటుంబం ప్రజల నమ్మకానికి ప్రతిరూపంగా ఉంది. 
– కేంద్రంలోని పెద్దలను గట్టిగా నిలదీయాలి. ప్రత్యేక హోదా ఊపిరి .అది ప్రజల హక్కు దానిని త్వరగా  వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
– హోదా కోసం వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రజాస్వామ్య యుతంగా అన్నిప్రయత్నాలు చేస్తున్నాము.  రాస్తోరోకోలు, దీక్షలు, బంద్‌ లు యువభేరిల వంటి కార్యక్రమాలతో ప్రత్యేక హోదా గురించి  ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాం. ఇలాంటి ప్రయత్నాలన్నిటి తరువాత ఎంపిలు రాజీనామాలు చేస్తామని చెప్పాం. 
– 13 రోజులపాటు పార్లమెంటులో అవిశ్వాసం నోటీసిచ్చాం. అయినా చర్చకు రాలేదు. అటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజా గొంతుకను వినిపించే అవకాశం లేకుండా చేçస్తున్నారు. 
– రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను మాట్లాడనీయరు, ప్రతిపక్షమే లేకుండా వ్యవహరిస్తున్నారు. 
–ఢిల్లీ ప్రభుత్వం ఒక్క రోజు కూడా అవిశ్వాస తీర్మానం నోటీసును తీసుకోని పరిస్థితిని చూస్తున్నాం. ఇలాంటి వైఖరిలతో సమాజానికి    ఏం నేర్పుతున్నారు.
–పంచపాండవుల పక్షాన ధర్మం, న్యాయం ఉన్నట్లే, నేడు నిరాహార దీక్ష చేస్తున్న ఎంపిల పక్షాన న్యాయం ఉంది.  
–ఎంపిలు రాజీనామా చేయడం తెలుగు దేశం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ పరిణామం. 
– రాజకీయాల్లో మాట ఇస్తే నిలబడాలని, వైయస్‌ రాజశేఖరెడ్డి ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. 
– గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ను ఆటవస్తువుగా తీసుకుని , స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించారు. రాజకీయంగా ఎదుగుతున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అడ్డుకోవాలన్న ఆలోచనతోనే విభజించారు.
– రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక హోదాకు చట్ట రూపం కల్పించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు , అయితే, అటు తరువాత మంత్రివర్గంలో చేసిన తీర్మానం కూడా మొక్కుబడిగా చేసినట్లుగా ఉంది.
– అక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం హోదాపై ప్రత్యేక శ్రద్ధ చూపక పోవడంతో అన్యాయం జరిగింది.
– విభజన సందర్భంగా ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. దుగరాజపట్నం, కడపకు స్టీల్‌ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో చూస్తున్నాం
– మహానేత వైయస్‌ ఆర్‌ ఉండి ఉంటే ప్రాణహిత, పోలవరం ఈపాటికి పూర్తి అయ్యి ఉండేవి. ఎప్పటికైనా వాటిని పూర్తి చేస్తానని ఆయన నిత్యం చెప్పేవారు..
- ప్రత్యేక హోదా పై రకరకాలుగా మాట్లాడారు. కోడలు కొడుకుని కంటానంటే...సంజీవని కాదని గతంలో పేర్కొని , ఇప్పుడు మళ్లీ నాటకాలు మొదలెట్టారు. . 
– అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్షతో రాష్ట్రాన్ని సాధించినట్లే, ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించినట్లే, అలుపెరగని పోరాటంతో తెలంగాణ సాధించినట్లే, ప్రత్యేక హోదా ఇవ్వక తప్పని స్థితిని తీసుకుని వద్దాం.
– ఊపిరి ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడతానని వైయస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. తమ ప్రాణాలకు తెగించి ఎంపిలు పోరాడుతున్నారు. 75 ఏళ్ల వయసులో మేకపాటి రాజమోహన రెడ్డి 25 గంటలకు పైగా దీక్ష చేశారు.
– గతంలో ఎవరైనా సంఘాలు, ప్రతిపక్షాలు దీక్షలు చేస్తే స్పందించే గుణం ప్రభుత్వాలకు ఉండేది , ప్రభుత్వం తరపున మంత్రులు వచ్చి చర్చలు జరిపేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఏమి చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ఇలా స్పందించడానికి కూడా పెద్ద మనసు ఉండాలి, కానీ అలాంటి మనసు ఇప్పుడు లేదు.
– హోదా విషయంలో 14 వ ఆర్థిక సంఘం వద్దన్నదనీ, హోదా సాధించిన రాష్ట్రాలు ఏం పురోభివృద్ధి సాధించాయని మాట్లాడుకుంటూ పోతే హోదా ఎప్పటికి వస్తుంది?
– ముఖ్యమంత్రి గారిని ఒక్కటే అడుగుతున్నా...వైయస్‌ ఆర్‌ హయాంలో చేపట్టిన 90–95 శాతం పూర్తి అయిన ప్రాజెక్టుల్లో ఎన్నిటిని పూర్తి చేశారు? ఏ పరిశ్రమలను తీసుకుని వచ్చారు? 4 ఏళ్లలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలి? 
– 40 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.
–ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడుదాం.
–మన ఊపిరి ఉన్నంత వరకు పోరాడదాం. అంతిమంగా సాధించుకునే అవకాశం ఉంది. 
– రాష్ట్రానికి ఎవరి ప్రత్యేక హోదా ఇస్తారో వారితో కలుస్తానంటూ జగన్‌ చెపుతున్నారు. అది ధర్డ్‌ ఫ్రంట్‌ గానీ, కాంగ్రెస్‌ కానీ, బిజెపి కానీ ఎవరు రాష్ట్రానికి హోదా ఇస్తారో వారితో కలవడానికి సిద్ధంగా ఉన్నారు.
– అవిశ్వాసం మీరు పెట్టినా మద్ధతిస్తాం, మేం పెడితే మద్ధతివ్వండి అని అడిగినా చంద్రబాబు పెట్టలేకపోయారు. 
– ఈ రోజు దీక్షకు కూర్చున్న 5 మంది ఎంపిలకు తోడుగా మిగిలిన 20 మంది ఎంపిలు కూడా కూర్చుని ఉంటే ప్రభుత్వానికి భయం ఉండేది.
– చంద్రబాబు వైఖరి ఎలా ఉన్నా ప్రత్యేక హోదా అంశం పై పోరాటాన్ని ఈస్థాయి వరకు తీసుకుని వచ్చాం, ఇప్పటికైనా అన్ని సంఘాలు, పార్టీలు  కలిసి పనిచేద్దాం
– ప్రజలు కూడా భయపడాల్సిన పనిలేదు, ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి హోదా ఉద్యమంలో పాలుపంచుకుంటే హోదా సాధించవచ్చు.
Back to Top