వైయస్‌ జగన్‌కు ముంబైలో అపూర్వ స్వాగతం


ముంబై :

ఒక్క రోజు పర్యటన కోసం సోమవారం ముంబై చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి నగరంలో అపూర్వ స్వాగతం లభించింది. ఠాణే, నవీ ముంబైలతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలు ఉదయం శాంతాక్రజ్ విమానాశ్రయంతో పాటు వై‌బీ చవాన్ ఆడిటోరియం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. ‌శ్రీ జగన్‌ను దగ్గరగా చూసేందుకు ఉదయం నుంచే తెలుగు ప్రజలు శాంతాక్రజ్ విమానాశ్రయం వద్ద బారులు తీరారు. ‘జగ‌న్ జిందాబాద్, జై జగన్, జై సమైక్యాంధ్ర’ అంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు.

Back to Top