ఏ ఎండకు ఆ గొడుగు పట్టడటం బాబుకు అలవాటు


అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్ర‌బాబు బాబుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడటం అలవాటని విమర్శించారు. అనంతపురంలో ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ..పార్లమెంటులో వైయ‌స్ఆర్‌సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై రాష్టానికి జరిగిన అన్యాయానికి ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడే అన్నారు. మొన్నటి దాకా ప్రత్యేక ప్యాకేజీ నాటకమాడి రాజకీయ అవసరాల కోసమే ఇప్పుడు ప్రత్యేకహోదా నినాదాన్ని ఎత్తుకున్నాడని చంద్రబాబు నాయుడిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదా కోసం రోడ్ల‌పైకి వ‌స్తే ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో అణ‌చివేస్తున్నార‌న్నారు. చంద్ర‌బాబుకు చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం పోరాటం చేయాల‌న్నారు.


Back to Top