విషయ పరిజ్ఞానం లేకే ఈ అవస్థలు

కరీంనగర్, 29 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు కోతలు, ఛార్జీల భారం మోపి రైతులు, నేతన్నల ఉసురు తీసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. ఈ పాలకులకు విషయ పరిజ్ఞానంలేక అహంకారంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మహానేత డాక్టర్ వైయస్‌ హయాంలో విద్యుత్తు ఛార్జీలు పైసా పెంచకుండా సక్రమంగా సరఫరా చేశారని గుర్తు చేశారు. మంత్రులు ఎక్కడా సమస్యలు లేవంటున్నారు. వారి నియోజకవర్గాల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు పోరాటానికి సిద్ధమయ్యామని చెప్పారు.
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: బాజిరెడ్డి
త్వరలో రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన పోతుందని రైతులు, నేతన్నలకు  బాజిరెడ్డి గోవర్ధన్ భరోసా ఇచ్చారు.  ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. మీకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ అండగా  ఉంటుందని హామీ ఇచ్చారు.  ప్రజాసమస్యలు ఎక్కడ ఉంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అక్కడే ఉంటుందని చెప్పారు. సమస్యలు లేవంటున్న పాలకులు  నేత కార్మికుడు సత్తయ్య మృతికి బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.

Back to Top