విశాఖలో వైయస్‌ఆర్‌సిపి 'మహిళ' మానవహారం

విశాఖపట్నం, 25 డిసెంబర్‌ 2012: ఢిల్లీలో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగదాంబ సెంటర్‌లో పార్టీ మహిళా విభాగం నాయకులు, శ్రేణులు మంగళవారంనాడు మానవహారం నిర్వహించారు. అనంతరం బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను నిరసనకారులు దగ్ధం చేశారు. 'అర్ధరాత్రి పూట మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కదా అని ఆ సమయంలో మనం తిరుగుతామా?' అంటూ బొత్స ఢిల్లీ అత్యాచార ఘటనపై వ్యాఖ్యానించడంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

తాజా ఫోటోలు

Back to Top