జననేత సంకల్పయాత్రకు సంఘీభావంగా..

బ్రహ్మరథం పడుతున్న ప్రజలు 

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖనగరంలో పాదయాత్ర చేపట్టారు. విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం రెండో రోజుకు చేరుకుంది. నగరంలోని అన్ని వార్డులను కలుపుకుంటూ ఎంపీ 12 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా రెండో రోజు ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ విజయసాయిరెడ్డి ముందుకు సాగుతున్నారు
Back to Top