విజయమ్మకు గన్నవరంలో ఘనంగా స్వాగతం

గన్నవరం (కృష్ణాజిల్లా) : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మకు గన్నవరం విమానాశ్రయంలో ఘన‌ంగా స్వాగతం లభించింది. గుంటూరు జిల్లా కాకాని వద్ద జరుగుతున్న బైబిల్ మిష‌న్ సభల్లో పాల్గొనేందుకు ‌విజయమ్మ ఇక్కడికి వచ్చారు. విజయమ్మతో పాటు ప్రముఖ సువార్తీకులు బ్రదర్ అని‌ల్‌కుమార్, మాజీ ఎం‌.పి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వచ్చారు.

హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన విజయమ్మకు పార్టీ‌ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, మచిలీపట్నం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు పేర్ని నాని, మేకతోటి సుచరిత, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు కోన రఘుపతి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రాంతీయ కో-ఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతా‌ప్ అప్పారావు, ముసునూరి రత్నబో‌స్, జంగా కృష్ణమూర్తి, మహిళా విభాగం జిల్లా కన్వీన‌ర్ తాతినేని పద్మావతి, పార్టీ ప్రచార కార్యదర్శి సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పార్టీ గుంటూరు జిల్లా, నగర కన్వీనర్లు మర్రి రాజశేఖ‌ర్, లేళ్ల అప్పిరెడ్డి, ‌యువజన విభాగం కన్వీనర్ మనోహ‌ర్ నాయుడు, గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు పి.గౌతంరెడ్డి, గన్నవరం పట్టణ కన్వీన‌ర్ సూరం విజ‌య్‌కుమార్, బైబి‌ల్ మిష‌న్ ప్రతినిధులు రెవరెండ్ ఆనందరావు, జా‌న్‌బాబు, దేవసహాయం, చిట్టిబాబు, శ్రీనివాసరావు, సుజాతారాయ్ తదితరులు స్వాగతం పలికారు.
Back to Top