మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్ట్‌ పూర్తిగా అక్రమం

తీవ్రంగా ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

తాడేప‌ల్లి: మాజీ మంత్రి జోగి ర‌మేష్ అరెస్టు పూర్తిగా అక్ర‌మ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు,  మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు,  మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఖండించారు. ఈ మేర‌కు ఓ సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

  • ఇది కేవలం కక్ష సాధింపు చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
  • కల్తీ మద్యం కేసులో జోగిరమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు
  • కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్‌రావు ద్వారా జోగి రమేష్‌ పేరు చెప్పించారు.
  • దానిపై జోగి రమేష్‌ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు స్పందించని టీడీపీ నేతలు
  • జోగి రమేష్‌ కుటుంబాన్ని ఇంకా వైయ‌స్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం
  • అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు
  • లేని లిక్కర్‌ స్కామ్‌లు సృష్టించారు
  • కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైయ‌స్ఆర్‌సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు
  • కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన జోగి రమేష్‌
  • దానిపై హైకోర్టులో పిటిషన్‌. అది విచారణకు రాకముందే జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు
  • కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్‌ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్‌ కోసమే జోగి రమేష్‌ అరెస్ట్‌
  • కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్‌ లేదు
  • కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్‌ను ఇరికించి అరెస్టు చేశారు.
  • ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం

జోగి రమేష్‌ అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపుఫ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

తూర్పు గోదావ‌రి జిల్లా:  మాజీ మంత్రి జోగి ర‌మేష్ అరెస్టు రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభివ‌ర్ణించారు.  జోగి రమేష్‌ అరెస్‌ను ఆయ‌న తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

`జోగి రమేష్‌ కుటుంబాన్ని, వైయ‌స్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం
రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు
నకిలీ మద్యం కేసులో డైవర్షన్‌ కోసమే అరెస్ట్‌లు చేస్తున్నారు 
ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు, అరెస్ట్‌లు
ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము
ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం` అని  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హెచ్చ‌రించారు

జోగి ర‌మేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

జోగి రమేష్‌ అరెస్ట్‌ ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. `చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైయ‌స్ఆర్‌సీపీని టార్గెట్‌ చేశారు
సూపర్‌ సిక్స్‌ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు, ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు
కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో పాలన సాగిస్తున్నారు.  వ్యక్తిగత కక్షలు, అరెస్ట్‌లు దారుణం
ప్రజలన్నీ గమనిస్తున్నారు, తగిన బుద్ది చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది` అని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి హెచ్చ‌రించారు.

కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య:  మాజీ మంత్రి మేరుగ నాగార్జున 

మాజీ మంత్రి జోగి రమేష్‌ అరెస్ట్‌ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఖండించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుంది. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.  

 

Back to Top